రేపు ఎక్సైజ్ కార్యాలయంలో బహిరంగ వేలం

రేపు ఎక్సైజ్ కార్యాలయంలో బహిరంగ వేలం

PPM: ఎక్సైజ్ నేరాల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు సోమవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు పార్వతీపురం ప్రోహిబిషన్, ఎక్సైజ్ సీఐ ఎస్.శిరీష తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. బహిరంగ వేలం సోమవారం ఉదయం 11 గంటలకు ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. పాటదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.