హోంగార్డుల సేవలు ప్రశంసనీయం: జిల్లా ఎస్పీ
సత్యసాయి: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులతో సమానంగా హోంగార్డులు అందించే సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ కొనియాడారు. వారి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 305 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని, నిజాయితీతో పనిచేసి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. తాము అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.