హైస్కూల్లో విద్యార్థులకు గీత పుస్తకాలు పంపిణీ
SRD: కల్హేర్ మండలం మార్డి గ్రామంలోని హైస్కూల్లో విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. స్థానికంగా 6వ నుంచి టెన్త్ వరకు చదువుతున్న విద్యార్థులకు శివశక్తి ఆధ్వర్యంలో అందజేసినట్లు జిల్లా శివశక్తి ప్రధాన కార్యదర్శి శివాజీ శ్రీనివాస్ తెలిపారు. తోర్నాల్‌కు చెందిన శ్రీపాల్ సహాయంతో ప్రతి హైస్కూల్లో భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.