అనంతపురంలో 'బీసీ గళం' బహిరంగ సభ
ATP: కూటమి ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఈ నెల 26న అనంతపురం లలితకళా పరిషత్‌లో 'బీసీ గళం' సభ నిర్వహించనున్నారు. వైసీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమ పోస్టర్లను జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆవిష్కరించారు. ప్రభుత్వం బీసీల సంక్షేమాన్ని విస్మరించిందని వెంకటరామిరెడ్డి విమర్శించారు.