ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం చేసిన ఎమ్మెల్యే నాగరాజు

ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం చేసిన ఎమ్మెల్యే నాగరాజు

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే నాగరాజు ప్రారంభించారు. బుధవారం ఇళ్ల వద్ద ముగ్గు పోసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2లక్షల రుణమాఫీతో పాటు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.