శారదా మార్కెట్ యథావిధిగా పనిచేస్తుంది: కమిషనర్

GNTR: గుంటూరులోని కొల్లి శారదా హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతున్నాయని కమిషనర్ పులి శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. ఇటీవల వేలంలో షాపులు పొందిన 20 మంది, వ్యాపారాలు ప్రారంభించారన్నారు. రైతులు మోసపోవద్దని, బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ మార్కెట్ తప్ప మరెక్కడా కూరగాయల మార్కెట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.