రాగులపాడు కాలువ కోసం 20 నుంచి రైతుల దీక్షలు

రాగులపాడు కాలువ కోసం 20 నుంచి రైతుల దీక్షలు

ATP: రాగులపాడు తూము నుంచి పిల్ల కాలువ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 20 నుంచి గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని రైతు సంఘం నిర్ణయించింది. ఆదివారం పాత గుంతకల్ బీరప్ప స్వామి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో నాయకులు జయన్న, డీ. జగదీష్ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా రైతులందరూ ఈ పోరాటంలో పాల్గొనాలని కోరారు.