ఓ వైపు వరదలు.. మరో వైపు భూకంపం

ఓ వైపు వరదలు.. మరో వైపు భూకంపం

ఇప్పటికే వరదలతో అతలాకుతలమవుతోన్న ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా దీవుల్లో ఏర్పడిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైంది. ఇప్పటికే కొండచరియలు, ఆకస్మిక వరదల కారణంగా 17 మంది మృతి చెందారు. దాదాపు 2000 ఇళ్లు ప్రభావితమయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో దాదాపు 65 వేల మంది దాక ఇబ్బందులకు గురవుతున్నారు.