VIDEO: భక్తిశ్రద్ధలతో రామయ్య పెళ్లి పనులు ప్రారంభం

VIDEO: భక్తిశ్రద్ధలతో రామయ్య పెళ్లి పనులు ప్రారంభం

BDK: భద్రాచలంలో శ్రీరామనవమికి ముందే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. మిథిలా స్టేడియంలో రామయ్య పెళ్లి పనులు ఆనందోత్సాహల నడుమ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పసుపు కుంకుమలు దంచారు. మహిళలు తలంబ్రాల తయారిలో ఎంతో ఉత్సహంగా పాల్గొన్నారు. స్టేడియంలో భక్తిశ్రద్ధలతో శ్రీరామనామ స్మరణలు మార్మోగాయి.