ఇసుక రవాణాకు అనుమతి తప్పనిసరి: సీఐ

ASF: ఆసిఫాబాద్‌లో అనుమతులు లేకుండా వాగుల నుంచి ఇసుక తరలిస్తున్న దందాలపై కఠిన చర్యలు ప్రారంభించినట్లు సీఐ తెలిపారు. ప్రభుత్వ అనుమతులతో ఇసుకను రవాణా చేయాలని, లేని పక్షంలో ట్రాక్టర్లను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడానికి అధికారులు నిఘా పెంచారు.