కృష్ణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

కృష్ణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

GDWL: మల్దకల్ మండలంలోని సద్దలోనిపల్లిలో ఉన్న స్వయంభు కృష్ణ స్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రతి శనివారము సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని విశేష పూజలను నిర్వహిస్తారని ఆలయ ఈవో పురేందర్ కుమార్ అన్నారు. ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమము ఉంటుందని ఆయన అన్నారు.