VIDEO: కొయ్యలగూడెంలో విద్యార్థులు మానవహారం
ELR: కొయ్యలగూడెం మండలం పరింపూడి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం బాల్యవివాహాల నివారణ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన సెంటర్లో మానవహారం చేపట్టి బాల్య వివాహాలు వద్దు చదువుకోవాలి ముందు అని నినాదాలు చేశారు. అలాగే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 గూర్చి కూడా ప్రచారం చేశారు.