పెనమలూరులో ఉచిత మెడికల్ క్యాంపు

కృష్ణా: పెనమలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆదివారం "అనుమోలు ఆదరణ చారిటబుల్ ట్రస్ట్" ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ క్యాంప్‌ను పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రారంభించి ప్రజలకు సేవలందించారు. ఇలాంటి మెడికల్ క్యాంపులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు.