జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ELR: స్వాతంత్య్రానికి ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను గుర్తించుకోవాలని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ధర్మరాజు జాతీయ జెండాను ఎగరవేశారు. సమరయోధుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళలర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.