షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
NZB: ఆర్మూర్‌లోని TSWR కళాశాల విద్యార్థులకు షీ టీమ్స్ బృందం ఆధ్వర్యంలో శనివారం పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో షీ టీమ్స్ పని విధానం, ఒంటరిగా ఉన్నప్పుడు తమను తాము రక్షించుకోవడం గురించి వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, డయల్ 100, టీ సేఫ్ యాప్, క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేయడం, మహిళల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.