కేకేవై రహదారిని జాతీయ రహదారి చేయాలంటూ కేంద్రమంత్రికి వినతి

KMR: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కారిని కరీంనగర్-సిరిసిల్ల- కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం (165 కి. మీ), సిరిసిల్ల-వేములవాడ-కోరుట్ల (65 కి. మీ)రహదారిని జాతీయ రహదారులుగా ప్రకటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం కోరారు. తీర్థయాత్ర మార్గాలకు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తాయని పేర్కొన్నారు.