'కలుషిత మంచినీటి సమస్యను పరిష్కరించాలి'

HYD: హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని సమతనగర్ కాలనీలో మంజీరా వాటర్ నీరు డ్రైనేజీతో కలసి సరఫరా అవుతుండటంతో శుక్రవారం కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు వాటర్ వర్క్స్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. వెంటనే లీకేజీ పనులను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో వాటర్‌వర్క్‌ర్ సూపర్‌వైజర్ నరేంద్ర, వాటర్ లైన్ మెన్ శ్రీకాంత్, కాలనీ వాసులు పాల్గొన్నారు.