మున్నింగిలో ఎరువుల కొరతపై అధికారుల తనిఖీ

GNTR: కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలోని ప్రైవేటు ఎరువుల దుకాణాలను ఏవో శ్రీనివాస్ రెడ్డి తనిఖీ చేశారు. వ్యాపారులు ఎవరైనా యూరియా కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రైతులు అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని, ఎవరైనా అధిక ధరలకు అమ్మితే వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.