విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

KKD: సామర్లకోట పిఠాపురం రోడ్డులో విద్యుత్ షాక్ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే హర్ష లిమిటెడ్ కంపెనీ పిఠాపురం రోడ్డు విస్తరణ పనులలో భాగంగా విద్యుత్ లైన్ మార్పు పనులు చేపట్టారు. కాగా, సామర్లకోటకి చెందిన ప్రైవేటు కార్మికుడు విద్యుత్ స్థంభంపై వున్న 11 కేవి విద్యుత్ లైన్ తగిలి బేతాల్ అనే కార్మికుడు మృతి చెందారు.