తురకపాలెంలో మిస్టరీ మరణాలు - ఆర్‌ఎంపీ క్లినిక్ సీజ్

GNTR: తురకపాలెంలో ఐదు నెలల్లో 28 మంది మృతి చెందారు. జూలై, ఆగస్టులోనే 20 మంది మరణించడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. మృతుల్లో కొందరు స్థానిక RMP వద్ద చికిత్స పొందినట్టు గుర్తించారు. అధిక యాంటీబయోటిక్స్, సెలైన్ వాడకం వల్ల మెలియాయిడోసిస్ ఇన్‌ఫెక్షన్ వ్యాపించి ఉండొచ్చని అనుమానం. దీనిపై ఆరోగ్య శాఖ ఆర్‌ఎంపీ క్లినిక్‌ను సీజ్ చేసి దర్యాప్తు చేపట్టింది.