పోక్సో కేసులో నిందుతునికి 20 ఏళ్లు జైలు శిక్ష

RR: పోక్సో కేసులో నిందితునికి ఎల్బీ నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. అంతేకాక అతనికి రూ.15 వేల జరిమానా విధించింది. నిందితుడు కర్నే దినేష్ (29) సంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలిపారు. అలాగే, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.