విఘ్నేశ్వరుని ఆలయం వద్ద భారీగా అక్షరాభ్యాసాలు
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సోమవారం వైశాఖమాసం శుద్ధ తదియ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భారీగా అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం చిన్నారులతో కిటకిటలాడింది. పటికి బెల్లం తులాభారం కూడా నిర్వహించారని అర్చకులు తెలిపారు.