అమరలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు

అమరలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు

కడప: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో వెలసిన శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో సోమవారం అమరలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు జింకా సాంబయ్య స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి పలు అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.