రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

GDWL: గద్వాల మండలం వీరాపురం గ్రామ సమీపంలో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న స్విఫ్ట్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ​ఈ ఘోర ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.