పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్సీ
CTR: కుప్పం మండలం నడుమూరు జడ్పీ హైస్కూల్‌ను ఎమ్మెల్సీ శ్రీకాంత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించిన ఆయన, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని పాఠశాల సమస్యలను ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.