భక్తి శ్రద్ధలతో వెంకటేశుని రథోత్సవం

భక్తి శ్రద్ధలతో వెంకటేశుని రథోత్సవం

కరీంనగర్: శంకరపట్నం మండలంలోని కేశవపట్నం జియ్యః గారి మఠంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలో భాగంగా శుక్రవారం ఉదయం కన్నుల పండుగగా రథోత్సవం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆసీనులైన రథం పురవీధుల గుండా రాగా భక్తులు మంగళహారతులతో ఎదురేగి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు హనుమాన్ మాలదారులు పాల్గొన్నారు.