YCP కార్యకర్తలకు కొడాలి నాని సెల్యూట్!

YCP కార్యకర్తలకు కొడాలి నాని సెల్యూట్!

AP: YCP ఆవిర్భవించి 16 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. పార్టీ కార్యకర్తల సేవలను మాజీమంత్రి కొడాలి నాని గుర్తుచేసుకున్నారు. వారంతా 16 ఏళ్లుగా తనతో అలుపెరగక నడుస్తున్న అజేయ సైన్యమని, సవాళ్లు ఎదురవుతున్నా జెండాను భుజాన వేసుకుని చూపిన తెగువ వెలకట్టలేనిదని కొనియాడారు.కార్యకర్తలు లేకుండా పార్టీ చరిత్ర పూర్తి కాదని, వారి త్యాగాలకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు.