పసుపు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి: డా.మహేందర్

NZB: జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా పసుపు పంట సాగులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పసుపు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.మహేందర్ నేడు రైతులకు సూచించారు. ఈ నెలలో అధిక వర్షాల వల్ల పసుపు తోటలలో నీరు నిలిచి, అధిక తేమతో దుంప కుళ్ళు వచ్చే అవకాశముందన్నారు. పసుపు తోటలు ప్రస్తుతం పెరుగు దశలో ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.