బంగారు కుటుంబాల పటిష్టతకు కార్యాచరణ
TPT: పీ-4 కార్యక్రమంలో ఐఎంఏ దత్తత తీసుకున్న 2వేల కుటుంబాల పటిష్టతకు చర్యలు రూపొందించాలని నగర కమిషనర్ మౌర్య సూచించారు. ఈ మేరకు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, సెక్రటరీ శ్యాంబాబు, ప్రతినిధులతో ఆమెశనివారం సమావేశం నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణలో ఐఎంఏతో సమన్వయం కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు.