షాపుపై కూలిన భారీ వృక్షం.. ముగ్గురికి గాయాలు..!
ములుగు: తాడ్వాయి (మం) మేడారంలో చేపట్టిన రోడ్ల విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం కారణంగా ఓ భారీ వృక్షం రోడ్డు పక్కనున్న షాపుపై పడి ముగ్గురికి గాయాలయ్యాయి. మేడారంలోని ఆర్టీసీ వై జంక్షన్‌లో రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. మహా జాతర నేపథ్యంలో చిటమట దేవేందర్, ధనలక్ష్మి, జనగాం సమ్మయ్య అక్కడే రోడ్డు పక్కన షాపు ఏర్పాటు చేసుకోగా, దానిపై పడింది.