సాలూరు మున్సిపాలిటీలో నిరుపయోగంగా మరుగుదొడ్లు
PPM: సాలూరు పట్టణంలో బైపాస్ రోడ్డులో లక్షలాది రూపాయలతో నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలు క్రితం మున్సిపల్ అధికారులు నిర్మించారు. నిర్మించిన కొద్ది రోజులకే నిర్వహణ లేక వృథాగా మారాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి నీటి సదుపాయంతో పాటు, మరుగుదొడ్లుకు తలుపులు వేసి ఉపయోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.