నేటితో స్పాట్ అడ్మిషన్లకు గడువు ముగింపు

RR: షాద్‌నగర్ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ, పీజీ కళాశాలలో ఉన్న సీట్ల స్పాట్ అడ్మిషన్లకు నేటితో గడువు పూర్తవుతుందని ప్రిన్సిపల్ నీతాపోలే గురువారం తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న గిరిజన విద్యార్థినులు స్పాట్ అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.