కాంగ్రెస్ పార్టీ నుంచి దుష్యంత్ రెడ్డి సస్పెండ్

కాంగ్రెస్ పార్టీ నుంచి దుష్యంత్ రెడ్డి సస్పెండ్

MBNR: జడ్చర్ల రాజకీయాలలో సంచలనం చోటుచేసుకుంది ఒక ఎమ్మెల్యే సోదరుడిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పార్టీ నుండి 5 సంవత్సరాలపాటు సస్పెండ్ చేశాడు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను వ్యక్తిగతంగా దూషించిన నేపథ్యంలో పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టు రాజాపూర్ మండల అధ్యక్షులు కృష్ణయ్య తెలిపారు.