VIDEO: నేడు లోయర్ మానేరు డ్యాం గేట్ల ఎత్తివేత

VIDEO: నేడు లోయర్ మానేరు డ్యాం గేట్ల ఎత్తివేత

KNR: లోయర్ మానేరు డ్యామ్ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలు, మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి వస్తున్న వరద కారణంగా ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 24 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 23.301 టీఎంసీల నీటిమట్టం నమోదైంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి డ్యాం స్పిల్వే గేట్లు ఎత్తనున్నారు.