రక్తసంబందీకుల నుంచి చట్టపరమైన దత్తత

రక్తసంబందీకుల నుంచి చట్టపరమైన దత్తత

KNR: రక్త సంబందీకుల నుంచి పిల్లలను దత్తత తీసుకోదలిస్తే అది చట్టబద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ-మిషన్ వాత్సల్య అధ్వర్యంలో కరీంనగర్‌కు చెందిన పిల్లలు లేని దంపతులు వారి రక్త సంబంధీకుల నుంచి 12 నెలల బాబును చట్ట పరమైన దత్తత తీసుకున్నారు. వీరికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు అందజేశారు.