యథావిధిగా అక్రమ మట్టి దందా

VKB: దోమ మండలంలో అక్రమ మట్టి దందా యథావిధిగా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండలంలోని మల్లెపల్లి తండా సమీపంలో కొందరు వ్యాపారులు జేసీబీల సాయంతో ప్రభుత్వ భూముల్లోంచి మట్టిని తవ్వి తరలిస్తున్నారు. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.