నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ... అన్ని ఏర్పాట్లు పూర్తి
NRML: మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 30వ వరకు భైంసా మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్, సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ తెలిపారు. మున్సిపల్ ఆఫీసులో 1-10 వార్డులకు సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో,11-26 వార్డుల నామినేషన్లు సెకండ్ ఫ్లోర్లో స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.