వెంచర్ పేరుతో రూ.150 కోట్లు స్వాహా.!

ఎన్టీఆర్: జిల్లాలో వెంచర్ల పేరుతో రూ. 150 కోట్లు స్వాహా చేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. శ్రీహరిపురంలో ఇద్దరు వ్యక్తులు నకిలీ వెంచర్ వేసి సుమారు 650 మందిని మోసం చేశారని, వెంచర్ బాధితులు శనివారం విజయవాడలో జరిగిన ధర్నాలో తెలిపారు. భూమిని కొనుగోలు చేయకుండా అన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 650 మంది వద్ద రూ.150 కోట్లు వసూళ్లు చేశారని వెల్లడించారు.