'ప్రజల సహకారంతోనే స్వచ్ఛ నల్లగొండ సాధ్యం'
NLG: ప్రజల సహకారంతోనే స్వచ్ఛ నల్లగొండ- హరిత నల్లగొండ సాధ్యమవుతుందని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్‌చంద్ర అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సోమవారం పలు డిబిజన్లలో పారిశుధ్య కార్యక్రమాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమాన్ని పరిశీలించారు.