చందన గణపతి స్వామిగా దర్శనం

చందన గణపతి స్వామిగా దర్శనం

HYD: సికింద్రాబాద్‌లో ప్రసిద్ధి చెందిన శ్రీ గణపతి దేవాలయంలో చందన గణపతిగా గౌరీ తనయుడు భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం సంకష్టహర చతుర్థి సందర్భంగా ఆలయ పూజారులు, వేద పండితులు గణపతి దేవుడిని చందనంతో అలంకరించారు. భక్తులు గణపతి దేవుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం సిబ్బంది, అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.