'అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు'
BDK: బూర్గంపాడు మండలంలోని నాగినేని ప్రోలు, గొమ్మూరు. ప్రాంతాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడానికి అధికారులు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ ప్రసాద్, ఎస్సై మేడ ప్రసాద్, ఎస్సై నాగబిక్షం ఆధ్వర్యంలో జేసీబీలతో కందకాలు తవ్వించారు. ఈ కందకాలను పూడ్చి, అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.