స్కూల్ తండాలో తీజ్ ఉత్సవం

MDK: హవేలి ఘనపూర్ మండలం స్కూల్ తండాలో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సాంప్రదాయం ప్రకారం గిరిజన యువతులు మొలకెత్తిన గోధుమ గింజల బుట్టలను నెత్తిన పెట్టుకొని సాంప్రదాయం ప్రకారం నృత్యం చేశారు. తండాలో జరిగిన తీజ్ ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొని గిరిజనులతో కలిసి సాంప్రదాయ నృత్యాలు చేశారు.