రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

MNCL: దండేపల్లి మండలంలో గోదావరి నది, వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై తహసీనుద్దీన్ ప్రకారం.. గోదావరి నది, పలు గ్రామాల్లోని వాగుల నుంచి నిత్యం ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. లింగాపూర్ నుంచి దండేపల్లి వైపు వస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.