LPG కొరత లేదు: కేంద్రం

LPG కొరత లేదు: కేంద్రం

పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై కేంద్ర వర్గాలు స్పందించాయి. ఇంధన భద్రత విషయంలో భారత్ మెరుగైన స్థితిలోనే ఉందని వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు కొరత లేదని స్పష్టం చేశాయి. ఇతర సరఫరాదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు  తెలిపాయి.