పులివెందులలో సీతారాముల కళ్యాణం

KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని కే.వెలమవారిపల్లిలో శ్రీ సీతారామ, లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ధ్వజ స్తంభ ప్రతిష్టాపనోత్సవం హోమాలను నిర్వహించారు. అనంతరం సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు వేదమంత్రాల మధ్య నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరూ పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు.