252 మందికి ఉద్యోగాలు కల్పించాం: CRDA
ఎన్టీఆర్: తుళ్లూరులోని CRDA స్కిల్‌హబ్ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాలో 252 మందికి ఉద్యోగాలు లభించాయని విజయవాడలోని CRDA కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తంగా 589 మంది అభ్యర్థులు 11 మంది కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరవ్వగా 252 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని, AP స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) సౌజన్యంతో తెలిపింది.