సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన మాజీ ఎమ్మెల్యే
MDK: పెద్ద శంకరంపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన CMRF చెక్కులను మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఇవాళ అందజేశారు. మండలంలోని గోపని వెంకటాపూర్ గ్రామానికి చెందిన కల్పనకు రూ. 37,500, మూసాపేట్‌కు చెందిన పోచమ్మకు రూ. 9వేలు, నాగ్ధర్ గ్రామానికి చెందిన శంకరమ్మకు రూ. 21వేలు, చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఉన్నారు.