వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి

NLG: జిల్లా BRS పార్టీ నాయకుల బృందం నేడు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ త్రిపాఠిని కలిసి, వీధి కుక్కల బెడదపై ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం సమర్పించారు. గిరిక బాయిగూడెం గ్రామంలో వీధి కుక్కలు దాడి చేసి మహిళకు పేగులు బయటకు వచ్చేలా గాయపరిచిన దారుణ ఘటనతో పాటు, పట్టణంలోని పలు వార్డుల్లో,చిన్నారులు, వృద్ధులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వారు వివరించారు.