VIDEO: రిలిక్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ జప్తు
WNP: వనపర్తి మండలంలోని నాచహళ్లి గ్రామ సమీపంలో ఉన్న రిలిక్ ఆగ్రో ఇండస్ట్రీస్‌లో ప్రభుత్వం ధాన్యం 15678.640 MTs కేటాయించడం జరిగింది. ఇందుకు గాను 1089.288 MTs ధాన్యం మాత్రమే ప్రభుత్వానికి ఇచ్చారు. మిగతా ధాన్యం పై నోటీసులు పంపించినా స్పందన లేదని వనపర్తి ఎమ్మార్వో రమేష్ రెడ్డి తెలిపారు. దీంతో విచారణ చేపట్టి రెవెన్యూ రికవరీ చట్టం కింద పంచానామ చేసి జప్తు చేశారు.