TSSTF రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా కృష్ణ
MLG: తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం(TSSTF) స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మందపల్లి కృష్ణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన నియమకానికి సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కృష్ణ అన్నారు.